ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ పథకం షురూ..!

ABN , First Publish Date - 2020-08-02T17:15:22+05:30 IST

ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన వన్‌ టైం ఆమ్నేస్టీ స్కీమ్‌(ఓటీఏఎస్‌) గ్రేటర్‌లో శనివారం నుంచి అమలులోకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు బకాయి...

ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ  పథకం షురూ..!

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన వన్‌  టైం ఆమ్నేస్టీ స్కీమ్‌(ఓటీఏఎస్‌) గ్రేటర్‌లో శనివారం నుంచి అమలులోకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తిపన్నుపై వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో... వాస్తవ పన్నుతోపాటు 10 శాతం వడ్డీ చెల్లించే వెసులుబాటు కలిగింది. లాక్‌డౌన్‌, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఖజానా నింపుకునేందుకు ఓటీఏఎ్‌సకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. 80 శాతం వడ్డీ మాఫీ చేయాలని స్టాండింగ్‌ కమిటీలో ఆమోదించి ప్రతిపాదన పంపగా.. ఏకంగా 90 శాతం మాఫీ చేస్తున్నట్టు పురపాలక శాఖ ప్రకటించింది. గ్రేటర్‌లో 5.41 లక్షల మందికి సంబంధించిన ఆస్తిపన్ను పెండింగ్‌లో ఉంది. అత్యధికంగా చార్మినార్‌ జోన్‌ పరిధిలో 1.34 లక్షలు, ఖైరతాబాద్‌ జోన్‌లో 1.08 లక్షలు, సికింద్రాబాద్‌లో 1.002 లక్షల మంది బకాయిదారులున్నారు. సెప్టెంబర్‌  15వ తేదీ వరకు అమలులో ఉండే పథకంపై విస్తృత అవగాహన కల్పించనున్నట్టు కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. మై జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఆన్‌లైన్‌, బిల్‌ కలెక్టర్ల ద్వారా పన్ను చెల్లించవచ్చని చెప్పారు. 



Updated Date - 2020-08-02T17:15:22+05:30 IST