తాళ్ల ప్రొద్దుటూరును రక్షించండి: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-09-27T09:07:41+05:30 IST

తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్థులను కాపాడడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యా ణ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు...

తాళ్ల ప్రొద్దుటూరును రక్షించండి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గండికోట రిజర్వాయర్‌ ముంపు పరిధిలో ఉన్న తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్థులను కాపాడడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యా ణ్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘రిజర్వాయర్‌ నీరు తమ కాలనీలోకి వస్తోందని, తమను కాపాడాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. మా పార్టీ నాయకులు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఇంకా పరిహారం అందనందువల్లే ఇక్కడే ఉండిపోయామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎక్కడికి వెళతారు?’ అని పవన్‌ ప్రశ్నించారు. నిర్వాసితులతో సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలని కోరారు.

Updated Date - 2020-09-27T09:07:41+05:30 IST