కాలుష్యం నుంచి రక్షణ కోసం!

ABN , First Publish Date - 2020-11-23T05:56:56+05:30 IST

చర్మ సోయగాన్ని దెబ్బతీసే వాటిలో కాలుష్యం ప్రధానమైనది. కాలుష్యం ప్రభావంతో చర్మం రంగు మారడం, మచ్చలు ఏర్పడడం, వయసు పైబడినట్టు కనిపిస్తుంది. చర్మం గరుకుగా మారుతుంది...

కాలుష్యం నుంచి రక్షణ కోసం!

చర్మ సోయగాన్ని దెబ్బతీసే వాటిలో కాలుష్యం ప్రధానమైనది. కాలుష్యం ప్రభావంతో చర్మం రంగు మారడం, మచ్చలు ఏర్పడడం, వయసు పైబడినట్టు కనిపిస్తుంది. చర్మం గరుకుగా మారుతుంది. ఈ సమస్యలు ఎదురవకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేమిటంటే...

  1. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తల చుట్టూ స్కార్ఫ్‌ లేదా దుపట్టా కప్పుకోవాలి. 
  2. ఎండపూట అడుగు బయట పెట్టేముందు సన్‌స్ర్కీన్‌ రాసుకోవడం మరచిపోవద్దు. అవసరమైతే గొడుగు వెంట తీసుకెళ్లాలి. 
  3. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒంటికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 
  4. వారంలో ఒకసారి అయినా నూనెతో స్నానం చేయాలి. దాంతో చర్మం మీది నూనెలు నిలిచి ఉంటాయి.
  5. సబ్బు బదులు అప్పుడప్పుడూ కుంకుడుకాయల పొడి, సెనగపిండి, పసుపులో తగు మోతాదులో నీళ్లు కలిపి స్నానం చేసేటప్పుడు ఒంటికి రుద్దుకోవాలి.
  6. ఇంటికి వచ్చిన తరువాత వేడినీళ్లు, స్క్రబ్బర్‌తో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మీది మలినాలు, మురికి తొలగిపోతాయి.
  7. ఈ జాగ్రత్తలతో పాటు పోషకాహారం తీసుకోవడం ముఖ్యమే. దాంతో ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

Updated Date - 2020-11-23T05:56:56+05:30 IST