ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2021-02-21T05:28:02+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సర్కారు భూములు అన్యా క్రాంతమవుతూనే ఉన్నాయి. భూ ప్రక్షాళనతో భూముల వివరాలను పక్కాగా చేసినా.. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నేటికీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ భూములకు రక్షణ కరువు

పలుచోట్ల ఆక్రమణకు గురవుతున్న భూములు

పాత డాక్యుమెంట్లతో అమ్మేందుకు యత్నాలు

పలుచోట్ల అడ్డుకుంటున్న అధికారులు

ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొన్ని చోట్ల వదిలేస్తున్న వైనం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సర్కారు భూములు అన్యా క్రాంతమవుతూనే ఉన్నాయి. భూ ప్రక్షాళనతో భూముల వివరాలను పక్కాగా చేసినా.. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నేటికీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ లొసుగులను ఆసరాగా చేసుకుని కొత్త వ్యక్తులు ఆ భూములు తమవేనని ముందుకు వస్తున్నారు. పాత డాక్యుమెంట్‌లను చూ పిస్తూ స్వాధీనానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిచోట్ల పేపర్లపైన ఒప్పందాలు రాసుకుంటూ అమ్మకాలు చేస్తున్నారు. భ విష్యత్తులో ప్రభుత్వ అవసరాలకోసం ఉపయోగపడే విలువై న భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చే స్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు పక్కాగా అడ్డుకుంటున్నా మరికొన్నిచోట్ల చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల కోర్టు ల వరకు వెళ్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో భూ ప్రక్షాళన తో భూముల లెక్కలు పక్కా అయ్యాయి.  రైతులకు కొత్త ప ట్టాదార్‌ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ భుము ల లెక్కలను సరిచేశారు. శాఖల వారీగా కూడా లెక్కలు తీశా రు. ఆ భూములను ధరణిలో కూడా ఆయా శాఖల పరిధిలో ఉన్నట్లు ఎంట్రీ చేశారు. ఆ భూముల పర్యవేక్షణ ఆయాశాఖ ల అధికారులకు అప్పజెప్పారు. 

వేల ఎకరాలలో ప్రభుత్వ భూములు

ఉమ్మడి జిల్లా పరిధిలో వేలాది ఎకరాల భూములు ఆయా శాఖల పరిధిలో ఉన్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో సుమారు 3,250 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. నవీపేట,  నందిపేట, ఆర్మూర్‌ పరిధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌కు పై న ఈ భూములు ఉన్నాయి. ఈ భూములు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రైతుల నుంచి సాగునీటి శాఖ అధికారులు తీ సుకున్నారు. భూ సేకరణ కింద డబ్బులను చెల్లించారు. వీటి ని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. భూములు ఎస్సారెస్పీ పే రుమీద ఉన్నా ఇప్పటికీ రైతులు సాగుచేసుకుంటున్నారు. 

నగరం చుట్టూ విలువైన భూములు

నిజామాబాద్‌ నగరం చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. బైపాస్‌ రోడ్డులో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణంతో పాటు ఐటీ హబ్‌, భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్ష ణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ భూ ములు ఉండడంతో ఎస్‌టీపీ ప్లాన్‌ నిర్మాణం చేశారు. ఇతర భూములను గుర్తించి ప్రభుత్వ అవసరాల కోసం వినియోగి ంచేందుకు నిర్ణయించారు. ఈ భూముల్లో అక్కడక్కడ కొంతమంది అక్రమాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్‌ అవ సరాల కోసం అధికారులు వీటిని ఉంచిన తాతలు, ముత్తాత ల నాడు తమ భూములని కొంతమంది డాక్యుమెంట్‌లతో ఖాళీ భూములకు వస్తున్నారు. ఇదే పరిస్థితి నిజామాబాద్‌ సహకార చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోనూ ఉంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో కూడా 3 ఎకరాలకుపైగా తమ భూములను ఒక వ్యక్తి రాగా ఫ్యాక్టరీ సంబంధించినవారు కోర్టుకు వెళ్లారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం పరిధిలో విలువైన భూములు ఉండ గా వాటి రక్షణకు చర్యలు లేక ఇతరులు ఆక్రమించుకుని గు డిసెలు వేసుకోగా సారంగపూర్‌ పరిధిలో వాటిని అధికారులు కూల్చివేశారు. కొన్నిచోట్ల కట్టించుకోకపోవడం వల్ల విలువైన భూముల్లో ఇళ్లు కూడా నిర్మాణం అయ్యాయి. చెరువు స్థలాల్లో ప్రైవేటు పాఠశాలలు వెలిశాయి. కిందిస్థాయి రెవెన్యూ అధి కారులు పట్టించుకోకపోవడం వల్ల నిజామాబాద్‌ నగరం ప రిధిలో పలు ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరిగాయి. చివరకు కొన్ని సంఘాలకు కేటాయించిన భూములు కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ సంఘాల ధర్నాతో వెనక్కు తగ్గారు. నగరం చుట్టుపక్కన కొంతమంది నే తల అండదండలతో ఈ భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్‌ పరిధిలో కూడా మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కూడా ఆక్రమాలకు గురవుతున్నాయి. చివరకు కొన్నిచోట్ల నిర్మాణాలు జరుగుతు న్నా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టు జోక్యంతో వాటిని నిలిపివేశారు. బోధన్‌లో నిజాం షుగర్‌కు సంబంధించిన భూములు కూడా గతంలో ఆక్రమనకు ప్ర యత్నాలు జరిగాయి. కార్మికులు ఆందోళన చేయడం అధికారుల జోక్యంతో వెనక్కి తగ్గారు. మండలాల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. సాగునీటి శాఖ, దేవదాయ, రెవెన్యూ, అటవీ, విద్యాశాఖలకు చెందిన భూములే ఎక్కువగా ఈ ఆక్రమణకు గురవుతున్నాయి. కామారెడ్డిలో కళాశాల భూములే ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఆందోళనలు చేయడం వల్ల కొంతమేరకు ఆగిపోతున్నాయి. గత కలెక్టర్‌ ఆ భూములు కాలేజీ పరంగా రి జిస్టర్‌ చేయడం వల్ల కొం తమేర ఆక్రమణలు తగ్గాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో  కొంత ప్రయత్నాలు జరిగినా అధికారుల జోక్యంతో తగ్గాయి. ఆయా మండలాల పరిధిలో కూడా విలువైన ప్రభు త్వ భూములపైన దృష్టిపెట్టి పాత రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఈ పనులను కొనసాగిస్తున్నారు. ఆక్రమణలకు పా ల్పడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ధరణి ద్వారా ప్రభుత్వ భూములను పక్కాగా చేసిన ఆ భూములన్నింటికి రక్షణగా కంచెలు వేస్తే కొంత మేర నివారించే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రాలు, మున్సీపాలిటీలు, మం డల కేంద్రాల పరిధిలో ఉన్న భూ ములకు భారీ గా రేట్లు పెరగడంతో అక్రమార్కుల దృష్టి వీటిపైన పడుతోంది. ఏ శాఖకు ఆ శాఖ అధికారులు ఈ భూములను కాపాడితే భవిష్యత్తులో వచ్చే పరిశ్రమలు, కార్యాలయాలు, కళాశాలలకు ఇవి ఉపయోగపడనున్నాయి. జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు దృష్టి పెడితే ఈ ఆక్ర మణలు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించడంతో పాటు కొత్తగా పుట్టుకొచ్చే డాక్యుమెంట్లకు కారణమైనవారిపైన కఠిన చర్యలు తీసుకు ంటే ఈ ఆక్రమణలు రాకుండా ఉండే అవకాశం ఉంది. భూములకు భారీగా రేట్లు పెట్టడం వల్ల కొంతమంది దృ ష్టి వీటిపై పడుతోందని సీనియర్‌ రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. ఏ శాఖకు ఆ శాఖ చర్యలు తీసుకుంటే ఇవి తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. డాక్యూమెంట్లు కూడా పక్కాగా ఉంచుకుని హద్దులను నిర్ణయిస్తే భూములు ఆక్ర మణకు గురికాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సమన్వయంతో వీటిని కా పాడితే భవిష్యత్‌ అవసరాలకు ఈ భూములు ఉపయోగపడనున్నాయి.

Read more