రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువు : టీడీపీ

ABN , First Publish Date - 2021-10-18T06:24:05+05:30 IST

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ అన్నారు.

రాష్ట్రంలో మైనారిటీలకు రక్షణ కరువు : టీడీపీ
సమావేశంలో మాట్లాడుతున్న ముస్తాక్‌ అహ్మద్‌

కనిగిరి, అక్టోబరు 17: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే మైనార్టీలపై దాడులకు పాల్పడుతోంద న్నారు. చంద్రబాబు హయాంలో కడప, విజయవాడలో నిర్మించిన హజ్‌హౌ్‌సలను సీయం జగన్‌ప్రభుత్వం ఇంతవరకు ప్రారంభించక పోవడం ముస్లీంల పట్ల చిన్నచూపేనని విమర్శించారు. మైనార్టీలు విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ముస్లింలకు దుల్హన్‌ పథకం కింద పెళ్లి ఖర్చులను వెంటనే ఇచ్చారన్నారు. కానీ సీయం జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు దుల్హన్‌ పధకంలో రూ. లక్ష రూపాయాలు ఇస్తామని మాట ఇచ్చి నేడు మడమ తిప్పాడన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి టీడీపీ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు. ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో నగర పంచాయతీ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌, నగర పంచాయతీ తెలుగు యువత అధ్యక్షులు షేక్‌ ఫిరోజ్‌, మైనార్టీ నాయకులు మాజీ అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు రోషన్‌ సందాని, సలీం, షేక్‌ జంషీర్‌ అహ్మద్‌, గుడిపాటి ఖాదర్‌, గౌస్‌బాష, రిజ్వాన్‌, పులి పఠాన్‌, నాయబా, ఉమర్‌ ఫరూక్‌, కరాటే యాసిన్‌, మస్తాన్‌బాబు, బుజ్జి, అప్రోజ్‌, ఆర్‌ఆర్‌ రఫీ, బడేబాయి, ఖలీల్‌, ఖాశీంసా, మన్సూర్‌, నజీర్‌, గౌస్‌బాష, బాబు, రహిమాన్‌, సుభాణి, మస్తాన్‌, జిలాని, ఆసీఫ్‌ పాల్గొన్నారు. 

పామూరు, : కనిగిరి టీడీపీ కార్యాలయానికి ఆదివారం విచ్చేసిన టీడీపీ ముస్లీంమైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు పామూరు మండల టీడీపీ ముస్లీం మైనార్టీ కమిటీ ఆద్వర్యంలో పలువురు కమిటీ సభ్యులు కనిగిరికి తరలి వెళ్లారు. 

టీడీపీ మండలాధ్యక్షుడిగా శివకోటేశ్వరరావు

దొనకొండ : టీడీపీ మండల అధ్యక్షుడిగా నాగులపాటి శివకోటేశ్వరరావు ఎంపికయ్యారు. దర్శి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బ్రహ్మంచౌదరి సమక్షంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక జరిగింది.  అధిక సంఖ్యలో సభ్యులు నాగులపాటి శివకోటేశ్వరరావు పేరు ప్రతిపాదించగా ఎంపిక పూర్తయ్యింది. 

పీసీపల్లి : మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మురుగుమ్మి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబులమ్మను ఆదివారం ఆ పార్టీనాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగురైతు అధ్యక్షుడిగా తురకపల్లికి చెందిన మండే పెద్దిరెడ్డి, తెలుగురైతు ప్రధాన కార్యదర్శిగా కోదండరామపురం గ్రామానికి చెందిన ఉప్పుగుండ్ల శివరామయ్య, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా గడ్డం హైమావతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య, కసిరెడ్డి హనుమారెడ్డి, మూలె సత్తిరెడ్డి, క్రిష్ణారెడ్డి ఉన్నారు. 

కనిగిరి : టీడీపీలోనే బీసీలకు సముచితస్థానం లభిస్తుందని ఆ పార్టీ  జాతీయ క్రమశిక్షణా  సంఘం సభ్యుడు గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్పోరేషన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంతో మంది బీసీలు ఆర్థిక పురోభివృద్ధి చెందారన్నారు. కానీ నేడు సీఎం జగన్‌ ప్రభుత్వం వచ్చాక లెక్కకు మించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని అప్పులు తెచ్చుకొంటోందని ఆరోపించారు. విదేశీ విద్యద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు వారికి అండగా ఉన్నారన్నారు.  శాఖలమీద అవగాహన లేని మంత్రులు జగన్‌మెప్పు కోసం ఎంతో సుదీర్ఘ పాలన దక్షత ఉన్న చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు విద్యుత్‌ సంస్థలలో ఒప్పందం చేసుకుంటే ఆనాడు ఆ విధానాన్ని విమర్శించిన జగన్‌ నేడు యూనిట్‌కు రూ. 20లు ఇచ్చినా విద్యుత్‌ దొరికని పరిస్థితి ఉందని ఆపార్టీ నాయకులే అనడం చూస్తే చంద్రబాబు విజన్‌ అర్థం చేసుకోవాలన్నారు.  సమావేశంలో నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు వీవీఆర్‌ మనోహరరావు, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, వేమూరి రామయ్య, బీసీసెల్‌ అధ్యక్షులు చింతలపూడి తిరుపాలు, తెలుగు యువత ఫిరోజ్‌, ఒలేటి చిన్న, చిలకపాటి లక్ష్మయ్య, రమణయ్య బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T06:24:05+05:30 IST