స్వీయ జాగ్రత్తలతోనే కరోనా బారి నుంచి రక్షణ

ABN , First Publish Date - 2021-05-10T05:43:31+05:30 IST

సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాలలో కరోనా పాజిటివ్‌ కేసులను నివారించడంలో భాగంగా ప్రజలందరూ వ్యక్తిగత జాగ్రత్త లు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునీత, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు సూచిం చారు.

స్వీయ జాగ్రత్తలతోనే కరోనా బారి నుంచి రక్షణ
హైపోక్లోరైడ్‌ని స్ర్పే చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

- మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీత, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి    

- సుల్తానాబాద్‌ పట్టణంలో హైపోక్లోరైడ్‌ పిచికారి

సుల్తానాబాద్‌, మే9: సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాలలో కరోనా పాజిటివ్‌ కేసులను నివారించడంలో భాగంగా ప్రజలందరూ వ్యక్తిగత జాగ్రత్త లు తీసుకోవాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునీత, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు సూచిం చారు. సుల్తానాబాద్‌ పట్టణంలో ఇటీవల పలువురు కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో అన్ని వార్డుల్లో ఆదివారం ప్రధాన రోడ్లు, కూరగా యల మార్కెట్‌, చేపల, మాంసం విక్రయాల చోట హైపోక్లోరైడ్‌ రసాయన ద్రావణాన్ని పిచికారీ చే యించారు. ఆదివారం మార్కెట్‌ ప్రాంతంలో జన సంచారం ఎక్కువగా ఉండడంతో వైరస్‌ వ్యాప్తి నివారణకు మున్సిపాలిటీ వారు ప్రత్యేక శ్రధ్ద తీసు కున్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా  వ్యా పార వాణిజ్య సంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి స్వీయ లాక్‌డౌన్‌ ప్రకటించి అమలు చేయడం జరుగుతోందన్నారు. ఉదయం ఆరుగంట ల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్ర మే పట్టణంలో షాపులు తెరిచి ఆ తర్వాత మూసి ఉంచుతున్నారు. ఇలా ప్రజలను బయటకు రాకుం డా చూస్తున్నామని, దాంతో పాటు ప్రతీ కుటుంబం ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప బయ టకు రావద్దన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని హెచ్చ రించారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరుచుగా చేతులను శానిటై జరతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా ఎవరూ భయాందోళన చెందవద్దని, దైర్యంగా ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడుతూ పౌష్టికాహారం తీసు కుంటూ ఇంట్లోనే ప్రత్యేక గదుల్లో గడపాలని సూ చించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యపరిచే విధంగా మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజు లుగా సుల్తానాబాద్‌ పట్టణంలో జ్వర పీడితుల సర్వే కొనసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్న సందర్భంలో వైద్య ఆరో గ్య శాఖ సిబ్బందితో పాటు స్థానిక అంగన్‌వాడీ టీచర్లు, అశా వర్కర్లు, ఏఎన్‌ఎం మున్సిపల్‌ సిబ్బం ది కలసి ఇంటింటి సర్వే నిర్వహించి కరోన అను మానిత లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరిస్తు న్నారు. గుర్తించిన వారికి మందులు ఇప్పించడంతో పాటు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి రెఫర్‌ చేయిస్తున్నారు.

Updated Date - 2021-05-10T05:43:31+05:30 IST