పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T04:19:01+05:30 IST

ఏపీ పౌర సమాఖ్య పిలుపు మేరకు మున్సి పాలిటీల్లో ఆస్తి పన్నులు, ఇతర యూజర్‌ చార్జీలు పెంచుతూ ప్రభు త్వం తీసుకువచ్చిన జీవోలను

పన్నుల పెంపు జీవోలను రద్దు చేయాలి
సచివాలయం ఎదుట నిరసన తెలుపుతున్న పౌరసమాఖ్య నాయకులు

కావలి, జూన్‌ 17: ఏపీ పౌర సమాఖ్య పిలుపు మేరకు మున్సి పాలిటీల్లో ఆస్తి పన్నులు, ఇతర యూజర్‌ చార్జీలు పెంచుతూ ప్రభు త్వం తీసుకువచ్చిన జీవోలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ కావ లి పట్టణ పౌరసమాఖ్య ఆధ్వర్యంలో గురువారం కావలి పట్టణ 2, 18 సచివాలయాల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కార్యదర్శు లకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పీ.పెంచల య్య మాట్లాడుతూ ఇంటిపన్ను, చెత్త పన్ను, యూజర్‌ చార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఖజానాను నింపు కోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరైనవి కావన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తదితర ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో యూజర్‌ చార్జీల పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో పౌరసమాఖ్య నాయకులు ఎస్‌కే మహబూబ్‌ బాషా, పీ.సత్యనారాయణ, ఎస్‌కే.మస్తాన్‌, సీపీఎం నాయకుడు పీ.వెం కయ్య, డీవైఎఫ్‌ఐ నాయకులు కృష్ణమోహన్‌, పెంచల నరసింహం, వీ.మల్లి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:19:01+05:30 IST