Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి అప్పలరాజు క్షమాపణలు చెప్పాలి

విధులు బహిష్కరించి వీఆర్‌వోల నిరసన 

గుంటూరు, డిసెంబరు 3: వీఆర్‌వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని వీఆర్‌వోల తూర్పు మండల సంఘం అధ్యక్షుడు ఎం.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.  శుక్రవారం పొన్నూరు రోడ్డులోని తూర్పు మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌వోలు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రానికి దశ దిశా చేయాల్సిన మంత్రి గౌరవహోదాలో ఉండి వీఆర్‌వోలను సచివాలయాలకు రాకుండా తరిమి కొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదన్నారు. కార్యక్రమంలో తూర్పు మండల సంఘం అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఈసీ మెంబర్‌ ఆర్‌.వెంకట్‌, ట్రెజరర్‌ ఎస్‌.జగదీష్‌ తదితరులున్నారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

 

Advertisement
Advertisement