పోలవరానికి అడ్డుకుంటారా?

ABN , First Publish Date - 2020-11-23T08:03:14+05:30 IST

‘పోలవరం’ బయలుదేరిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను తిరుపతిలో ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.

పోలవరానికి అడ్డుకుంటారా?
అంబేడ్కర్‌ విగ్రహం ముందు బైఠాయించిన నారాయణ

 ఆంధ్రజ్యోతి, తిరుపతి : ‘పోలవరం’ బయలుదేరిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను తిరుపతిలో ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అంబేడ్కర్‌ విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీ నాయకులు పోలవరం పరిశీలించేందుకు బయలుదేరేందుకు సిద్ధమైతే గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. తామేమన్న ఇడుపులపాయకు పోవడంలేదు కదా జాతీయ ప్రాజెక్ట్‌ను పరిశీలించాలనుకుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. పద్ధతిగా పంపితే ఒక దారిలో వెళతామని లేకుంటే పది దారుల్లో వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా లేమని అంతకుముందు మీడియాతో చెప్పారు.


Updated Date - 2020-11-23T08:03:14+05:30 IST