Abn logo
Sep 23 2021 @ 00:45AM

ట్రాన్సకో కార్యాలయం ఎదుట నిరసన

వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నాయకులు

యాడికి, సెప్టెంబరు22: విద్యుత చార్జీలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం యాడికిలోని ట్రాన్సకో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి వెంకటరాముడు, మండల ప్రధాన కార్యదర్శి వీబీ వెంకటేష్‌ మాట్లాడుతూ సర్‌చార్జీలు, ట్రూఅప్‌ చార్జీల పేరుతో వినియోగదారులపైన ఆర్థికభారం మోపడం దారుణమన్నారు.  ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా కరెంట్‌ చార్జీలు ఇలా పెంచడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం ట్రాన్సకో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వెంకటరమణ, నాయకులు శ్రీరాములు, నబీరసూల్‌, సూరప్ప తదితరులు పాల్గొన్నారు.