మైక్రో ప్యాకేజీ విధానంపై నిరసన

ABN , First Publish Date - 2020-06-06T09:56:46+05:30 IST

మున్సిపల్‌ కార్మికులపై పని భారాన్ని పెంచేలా మైక్రో ప్యాకేజీ విధానం ఉందంటూ శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం

మైక్రో ప్యాకేజీ విధానంపై నిరసన

రామలక్ష్మణ జంక్షన్‌:  మున్సిపల్‌ కార్మికులపై పని భారాన్ని పెంచేలా మైక్రో ప్యాకేజీ విధానం ఉందంటూ శ్రీకాకుళం నగరపాలక కార్యాలయం వద్ద కార్మికులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మా ట్లాడుతూ, మైక్రో ప్యాకేజీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో పోరాటం ఉధృతం చేస్తామస్తామన్నారు.


ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తలను వేరు చేయడం, పని ప్రదేశాల్లో కార్మికులను వీడియో తీయాలని, పనులన్నీ చేయించాలని, అలా చేయని వారిపై చర్యలు తీసుకో వాల్సిందిగా మున్సిపల్‌ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్లకు డైరెక్షన్‌ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు బలరాం, గణేష్‌  పాల్గొన్నారు.


ఇచ్ఛాపురం: పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిటూ మండల కార్యదర్శి రమేష్‌ పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయ సమీపంలో నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రతి ఆరు నెలలకు ప్రభుత్వమే వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు.


కవిటి : పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని సిటూ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కవిటిలోని సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7నెలల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు.    

Updated Date - 2020-06-06T09:56:46+05:30 IST