Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని నిరసన ర్యాలీ

ధర్మారం, డిసెంబర్‌ 3: డీజిల్‌ పెట్రోల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాల ని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ప్రైవేట్‌ వాహనాదారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వివిధ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలతో మార్కెట్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహహం వరకు నిర సన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా యూనియన్‌ల ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డీజిల్‌, పెట్రోల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పలు యూనియన్‌ ప్రతి నిధులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాడె సూర్యానారాయణ, ఎండి చున్ను, బొంతల నర్సింగం, తిరుపతి, ప్రభాకర్‌, సాగల శ్రీనివాస్‌, దేవి లక్ష్మీరాజం, మిట్ట కరుణాకర్‌, బెక్కం హరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement