విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని నిరసన

ABN , First Publish Date - 2022-01-22T05:18:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతం అవుతున్న దృష్ట్యా తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని తెలుగుయువత రాష్ట్ర అధికారప్రతి నిధి చిన్నూరు విజయ్‌చౌదరి పేర్కొన్నారు.

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని నిరసన
వినతిపత్రం అందజేస్తున్న తెలుగుయువత నాయకులు

ధర్మవరం, జనవరి 21: రాష్ట్రంలో కరోనా ఉధృతం అవుతున్న దృష్ట్యా తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని తెలుగుయువత రాష్ట్ర అధికారప్రతి నిధి చిన్నూరు విజయ్‌చౌదరి పేర్కొన్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడు తూ...రాష్ట్రంలో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్నారు. ఈ వైరస్‌ వల్ల విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహి స్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మా డకుండా తక్షణమే సెలవులు ప్రకటించి ఆన్‌లైన్‌ విధానాన్ని తిరిగి కొన సాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగుయువత ఉపాధ్యక్షులు వీర, పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కా ర్యదర్శి తిరుమలేశ్‌, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు మధు సూదన్‌, 40వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్‌ అశోక్‌, తెలుగుయువత నాయకులు సంగాలబాలు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఇర్షాద్‌, పార్లమెంట్‌ అధికార ప్రతినిఽధి ప్రతాప్‌, ఎన్‌బీకే హరి, నాయకులు బోడగల ప్రభాకర్‌, వినోద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T05:18:44+05:30 IST