ప్రజల నడ్ది విరిచిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-09T05:16:06+05:30 IST

సుపరిపాలన అందిస్తామని, అచ్చేదిన్‌ తెస్తామని, నమ్మబలికి కేంద్రంలో అధికారం లోని వచ్చిన బీజేపీ అన్ని రకాల ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రజల నడ్ది విరిచిన కేంద్రం
గద్వాల పట్టణంలో గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌

- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- కుటుంబం లేనివారికి ధరల కష్టం తెలియదు

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల టౌన్‌, జూలై 8 : సుపరిపాలన అందిస్తామని, అచ్చేదిన్‌ తెస్తామని, నమ్మబలికి కేంద్రంలో అధికారం లోని వచ్చిన బీజేపీ అన్ని రకాల ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. వంట గ్యాస్‌ ధర పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో శుక్రవారం గద్వాల పాత బస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గడచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ధరను రూ.410ల నుంచి రూ.1105కు పెం చడం దుర్మార్గమన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెం చడంతో, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రధాని మోదీ హయాంలో అచ్చేదిన్‌ స్థానంలో, ప్రజలకు సచ్చేదిన్‌ వచ్చిందంటూ దుయ్యబట్టారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ కుటుంబాలు లేనివారికి కుటుంబాల నిర్వహణ భారం తెలియదని పరోక్షంగా నరేంద్రమోదీపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.  


మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ సవాల్‌ 

ధర్నాలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న మూడు మరణాలు కలుషిత నీటి వల్లే జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించడం బాధ్యతా రాహిత్యమన్నారు. కలుషిత నీటి వల్లే మరణాలు చోటు చేసుకున్నాయని వారు రుజువు చేస్తే పదవి నుంచి తప్పుకుని, రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. సమావేశం లో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ సుభాన్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య,  జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  


సామాన్యుల గుండెలపై గ్యాస్‌ బండ

అయిజ : సామాన్యుల గుండెలపై బీజేపీ గ్యాస్‌ బండ మోపిందని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరకు నిరసనగా బుధవారం అయిజ పట్టణంలోని కర్నూల్‌, రాయిచూర్‌ జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్రహాం మహిళలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, సింగిల్‌ విండో అధ్యక్షుడు పోతుల మదుసూదన్‌రెడ్డి, ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, కౌన్సిలర్లు సీఎం సురేశ్‌, నర్సింహులు, నాయకులు రఘునాథ్‌రెడ్డి, మైబు, ఆంజనేయు లు, శ్రీరాములు, మల్లికార్జున్‌, వర్మ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-09T05:16:06+05:30 IST