Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి సురేష్‌కు నిరసన సెగ

అనంతపురం: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement