ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిరసనలు

ABN , First Publish Date - 2022-01-19T04:22:50+05:30 IST

తగ్గించే పీఆర్సీ తమకు వద్దని, వెంటనే ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిబాబా, సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, పాండురంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిరసనలు
పత్తికొండలో నిరసన

పత్తికొండటౌన్‌, జనవరి 18: వేతనం తగ్గించే పీఆర్సీ తమకు వద్దని, వెంటనే ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సాయిబాబా, సత్యనారాయణ, ప్రసాద్‌బాబు, పాండురంగారెడ్డి డిమాండ్‌ చేశారు. పత్తికొండ పట్టణంలో మంగళవారం నాలుగు స్తంభాల కూడలిలో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ ఉత్తర్వుల కాపీలను కాల్చి వేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాండురంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, నర్సోజీ పాల్గొన్నారు. 


వెల్దుర్తి: పట్టణంలోని ఎంఆర్‌సీ భవనంలో ఉపాధ్యాయ సంఘాలు 11వ పీఆర్‌సీ ప్రతులను మంటల్లో వేసి కాల్చివేశారు. ఫ్యాప్టో జిల్లా నాయకుడు ఎస్‌ఎం జయరాజు, కార్యదర్శి సీఎన్‌సీహెచ్‌ మద్దిలేటి, యూటీఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హుశేణ్‌మియ్యా, ముర్తుజావలి, ఏపీటీఎఫ్‌ యు.మహేశ్వరరెడ్డి, డి.రాము, రంగస్వామి, దస్తగిరి, శ్రీరాముడు, యూటీఎఫ్‌ కేశన్న, పి.అరుణ, రాజేశ్వరి, రాజకుమారి, సువేదమ్మ, తదితరులు పాల్గొన్నారు. 


గూడూరు: గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూలు, బాలురు, బాలికల పాఠశాలలో ఫ్యాప్టో సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఫ్యాప్టో జిల్లా కో చైర్మన్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్‌. గోకారి  మాట్లాడుతూ 20వ తేదీన కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సురేష్‌బాబు, జయమ్మ, హనుమంతరెడ్డి, షఫీ, నాగభూషణం, మురళీగౌడు, ఖాద్రి, అనూప్‌ పాల్గొన్నారు.


డోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్‌సీ నల్ల జీవోలను వెంటనే రద్దు చేయాలని డోన్‌ ఫ్యాప్టో నాయకులు వెంకట సుబ్బారెడ్డి, ఎన్‌ఎస్‌ బాబు, వెంకటరమణ, లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని పాతబస్టాండులో పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీఆర్‌సీ జీవో కాపీలను కాల్చివేశారు. ఫ్యాప్టో నాయకులు శివప్రసాద్‌, సుబాన్‌, మద్దిలేటి, సుబ్బరాయుడు, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌గౌడు, పద్మావతమ్మ, లీలావతమ్మ పాల్గొన్నారు.


బేతంచెర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధంం కావాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ ఆజాం బేగ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం బేతంచెర్ల పట్టణంలోని చైతన్య ప్రైవేటు పాఠశాలల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం ముగిసిన అనంతరం భోజన విరామ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ ఉత్తర్వులను నిరసిస్తూ ప్రతులను దహనం చేశారు. హెచ్‌ఎంలు రాజేశ్వరి, విజయకుమారి, ప్రభాకర్‌, మురళీ, కృష్ణ, పాపారాయుడు, లక్ష్మికాంత నాయక్‌, అన్వరులల్లా, శివకుమార స్వామి, బలరాముడు, ఫకృద్దీన్‌, రవికుమార్‌, ఉపాధ్యాయులు వెంకటస్వామి, రమేష్‌, సుబ్బా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్యాపిలి: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవో ప్రతులను కాల్చివేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు అబ్దుల్‌ లతీఫ్‌, వెంకటనాయక్‌, చిన్నపురెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు సర్వజ్ఞమూర్తి, చంద్రమౌళి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-01-19T04:22:50+05:30 IST