నల్లజాతీయుడి మృతిపై నిరసనల హోరు!

ABN , First Publish Date - 2021-04-14T13:17:44+05:30 IST

మినియాపొలిస్‌ శివార్లలో నల్లజాతీయుడు డాంటే రైట్‌(20) కాల్చివేత ఘటనలో ఆందోళనలు వరసగా రెండో రోజూ కొనసాగాయి.

నల్లజాతీయుడి మృతిపై నిరసనల హోరు!

పలువురి అరెస్టు, సిటీ మేనేజర్‌ తొలగింపు

బ్రూక్లిన్‌ సెంటర్‌(అమెరికా), ఏప్రిల్‌ 13: మినియాపొలిస్‌ శివార్లలో నల్లజాతీయుడు డాంటే రైట్‌(20) కాల్చివేత ఘటనలో ఆందోళనలు వరసగా రెండో రోజూ కొనసాగాయి. అయితే.. తమ అధికారిణి టేజర్‌(మనిషికి షాక్‌ ఇచ్చి తాత్కాలికంగా కదలకుండా చేసే పరికరం)ను కాల్చాలనుకున్నారని.. ప్రమాదవశాత్తూ తుపాకీని కాల్చడంతో ఈ దారుణం జరిగిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించే ఫుటేజీని కూడా వారు విడుదల చేశారు. అయినప్పటికీ.. రైట్‌ మృతిపై నిరసనలు కొనసాగాయి. మినియాపొలిస్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అధికారులను మోహరించారు. బ్రూక్లిన్‌ సెంటర్‌లో 40మందిని మినియాపొలిస్‌లో 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కాల్పులకు కారణమైన అధికారిణిని వెంటనే విధుల నుంచి తప్పించాలని నగర మేయర్‌ మైక్‌ ఇలియట్‌ అభిప్రాయపడ్డారు. పోలీసులను నియంత్రించే నగర మేనేజర్‌ను విధుల నుంచి తప్పించడం గమనార్హం.

Updated Date - 2021-04-14T13:17:44+05:30 IST