వెల్లువెత్తిన నిరసనలు

ABN , First Publish Date - 2022-01-27T05:24:50+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు. మొత్తం పీఆర్సీని సమీక్షించి సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా వచ్చేనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వానికి సోమవారం సమ్మె నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది.

వెల్లువెత్తిన నిరసనలు
ఒంగోలులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న పీఆర్సీ సాధన సమితి నేతలు

జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు, 

ఉపాధ్యాయుల ర్యాలీలు

అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 26 : రివర్స్‌ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం కూడా నిరసనలు  వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు.  మొత్తం పీఆర్సీని సమీక్షించి సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా వచ్చేనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వానికి సోమవారం సమ్మె నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆమేరకు మంగళవారం జిల్లాకేంద్రమైన ఒంగోలులో వేలాది మందితో మహాధర్నా నిర్వహించిన పీఆర్సీ సాధన సమితి నాయకులు బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పీఆర్సీ సాధన సమితి ఆద్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జరిగిన  కార్యక్రమంలో పీఆర్సీ సాధన సమితి నాయకులు కూచిపూడి శరత్‌బాబు, ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌, ఎండ్లూరి చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, వరకుమార్‌, మాధవి, ఏడుకొండలు, రోజ్‌కుమార్‌, ఎం.వెంకటేశ్వర్లు, షరీఫ్‌, తోట శ్రీను, డి.నాగేశ్వరరావు, కోటేశ్వరమ్మ, కిషోర్‌, సుబ్బారావు, ఊతకోలు శ్రీనివాసులు, రత్నాకర్‌, సునీల్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-27T05:24:50+05:30 IST