Abn logo
Mar 23 2021 @ 12:29PM

మహిళలకు ప్రొటీన్‌ ముఖ్యమే!

ఆంధ్రజ్యోతి(23-03-2021)

ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఆహారం మహిళలకు శక్తినివ్వడమే కాదు వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే డైట్‌లో ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. 


జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రొటీన్‌ కావాలి. అంతేకాదు కండరాల దృఢత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రొటీన్‌ తోడ్పడుతుంది. 

శరీరం చక్కని రంగులో, ఫిట్‌గా ఉండేందుకు మహిళలు ప్రొటీన్‌ తినాలి. 

రోజుమొత్తంలో మగవాళ్లకు 56 గ్రా. ప్రొటీన్‌ అవసరమైతే మహిళలకు 46 గ్రా. కావాలి. 

పాలు, పాల ఉత్పత్తులు, నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, గింజలలో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. 

మొక్కల సంబంధిత ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రోజుకు సరిపోయే ప్రొటీన్లు లభిస్తాయి. ఉదాహరణకు సోయాబీన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. 


Advertisement
Advertisement
Advertisement