ప్రొటోకాల్‌ రగడ

ABN , First Publish Date - 2021-10-23T06:10:50+05:30 IST

గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాప న, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించట్లేదని కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు.

ప్రొటోకాల్‌ రగడ
జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డితో వాగ్వివాదానికి దిగిన కాంగ్రెస్‌ సభ్యులు

గరం గరంగా జడ్పీ సమావేశం  

మైక్‌ కట్‌ చేయడంతో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆగ్రహం 

పోడియం వద్ద బైఠాయించి నిరసన  తెలిపిన కాంగ్రెస్‌ సభ్యులు 

కలెక్టర్‌ చొరవతో సద్దుమణిగిన వివాదం 


భువనగిరి రూరల్‌, అక్టోబరు 22: గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల శంకుస్థాప న, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో అధికారులు  ప్రొటోకాల్‌ పాటించట్లేదని కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని, జడ్పీటీసీ, ఎంపీపీల కు ఎలాంటి నిధులు కేటాయించటం లేదని కాంగ్రెస్‌ పార్టీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ కుడుదల నగేష్‌ సభలో అధికారులను నిలదీశారు. సమావేశంలో నగేష్‌ మాట్లాడుతుండగా జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి మైక్‌ కట్‌ చే యించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యుడిగా తమ హక్కుల గురించి ప్రస్తావిస్తుంటే, మైక్‌ కట్‌ చేయడమేమిటని నగేష్‌ నిలదీశారు. తన చేతిలో ఉన్న మైక్‌ను, అజెండా పుస్తకాన్ని నేలకు విసిరికొట్టా రు. తమకు జరిగిన అన్యాయం ప్రశ్నిస్తుంటే మైక్‌ ఎలా కట్‌ చేస్తారని కాంగ్రెస్‌ సభ్యులు నగే్‌షతో పా టు చౌటుప్పల్‌, వలిగొండ జడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వాకిటి పద్మ, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు ఎంపీపీలు నూతి రమేష్‌, శ్రీశైలం, జి.అశోక్‌ జడ్పీ చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. సభ్యులంతా పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలుగా పదవీ బాధ్యత లు చేపట్టన నాటి నుంచి ఏ పనులు చేయలేక ఉత్స వ విగ్రహాలుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింద ని నిలదీయటంతో జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. పలు అంశాలు, సమస్యల పరిష్కారంపై అధికారులపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో సభ గందరగోళంగా మారింది. దీంతో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ పమే లాసత్పథి జోక్యం చేసుకుని ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం ప్రొటోకాల్‌ పాటించాలని అధికారులను ఆదేశించారు. మరోసారి పొరపాటు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రొటోకాల్‌ విషయంలో అధికారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని జడ్పీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.


సభలో లేవనెత్తిన అంశాలు

ఈ సందర్భంగా పలువురు సభ్యులు సభలో పలు అంశాలను లేవనెత్తారు. రైతు బీమాపై అవగాహన కల్పించకపోవడంతో సంబంధిత రైతు కుటుంబాలు ఇన్స్యూరెన్స్‌ డబ్బులు రాక నష్టపోయాయని జడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి ధాన్యం సేకరణ చేపట్టాలని, గత రబీలో తేమ, తాలు, సాకుతో కొనుగోలు చేసిన ధాన్యానికి తక్కువగా డబ్బులు చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో తహసీల్దార్లు తమను అగౌరవపరిచారని పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో 10 శాతం కమీషన్‌ను డిమాండ్‌ చేస్తున్నారన్నారు. చౌటుప్పల్‌లోని దివీస్‌ ల్యాబ్‌ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలేదని చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చెరువులు, కుంటలకు గండి పడినప్పటికీ ఇరిగేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌, సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, స్థానిక ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T06:10:50+05:30 IST