Jun 18 2021 @ 01:49AM

గౌతమ్‌ను చూసి గర్వపడుతున్నా

తనయుడు గౌతమ్‌ ప్రతిభను చూసి తల్లిగా గర్వపడుతున్నాను అని చెప్పారు నమ్రతా శిరోద్కర్‌. ఇన్నాళ్లూ మహేశ్‌బాబు- నమ్రతల ముద్దుల తనయుడుగానే గౌతమ్‌ ప్రపంచానికి పరిచయం. కానీ అతనిలో మంచి ఈతగాడు దాగున్నాడనే విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతున్నారు గౌతమ్‌. తన వయసు క్రీడాకారుల విభాగంలో ఏకంగా తెలంగాణలోనే టాప్‌ 8 స్థానంలో నిలిచాడు. రెండేళ్ల క్రితమే ఈత సాధన ప్రారంభించిన గౌతమ్‌ స్వతహాగానే అందులోని మెలకువలను ఔపోసన పట్టారు. బట్టర్‌ ఫ్లై, బ్రెస్ట్‌ స్ట్రోక్‌, ప్రీ స్టైల్‌, బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాల్లో కఠోర శ్రమతో మంచి నైపుణ్యం సాధించారు. గౌతమ్‌ ఈత కొడుతున్న వీడియోను  నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘ఫ్రీ స్టైల్‌ గౌతమ్‌ ఫేవరేట్‌. మూడు గంటల్లో ఐదు కిలోమీటర్లు ఈదగలడు’’ అని నమ్రత వివరించారు.