ఘనంగా గౌరీ పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-10-22T04:52:21+05:30 IST

గౌరీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుగుబిల్లి మండంలోని రావివలస, నాగూరు, గిజబ, గరుగుబిల్లి, శివ్వాం, గొట్టివలస, పెద్దూరు, రావుపల్లి గ్రామాల్లో పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను బుధవారం రాత్రి ప్రతిష్టించారు. ముందుగా గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఘనంగా గౌరీ పౌర్ణమి వేడుకలు
రావివలసలో పార్వతీ పరమేశ్వరులను ఊరేగిస్తున్న ప్రజలు

గరుగుబిల్లి, అక్టోబరు 21 : గౌరీపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుగుబిల్లి మండంలోని రావివలస, నాగూరు, గిజబ, గరుగుబిల్లి, శివ్వాం, గొట్టివలస, పెద్దూరు, రావుపల్లి గ్రామాల్లో పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను బుధవారం రాత్రి ప్రతిష్టించారు. ముందుగా గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. రావివలసలో ఏటా పండగ మాదిరిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దూరులో నాగులచవితి వరకు వేడుకలు నిర్వహిస్తారు. గౌరీపౌర్ణమిని పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు  ఏర్పాటు చేశారు. 



Updated Date - 2021-10-22T04:52:21+05:30 IST