ఘనంగా మాతృ దినోత్సవం

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

జిల్లాలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కేఆర్‌కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మాతృ దినోత్సవం

ఆదిలాబాద్‌ అర్బన్‌, మే 9: జిల్లాలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కేఆర్‌కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో  మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్య క్షుడు కారింగుల ప్రణయ్‌ మాట్లాడుతూ ప్రతీ అమ్మకు నిజానికి ఆరోజు.. ఈరోజు కాకుండా ప్రతి రోజూ అమ్మ రోజేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్‌, అక్షయ్‌, మున్నా, పురుషోత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST