మెరుగైన సేవలు అందించండి: కలెక్టర్‌ మెరుగైన సేవలు అందించండి: కలెక్టర్

ABN , First Publish Date - 2020-09-22T10:44:43+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు. సోమవారం కల్లూరు మండలంలోని 66, 67 వార్డు సచివాల

మెరుగైన సేవలు అందించండి: కలెక్టర్‌ మెరుగైన సేవలు అందించండి: కలెక్టర్

కర్నూలు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు. సోమవారం కల్లూరు మండలంలోని 66, 67 వార్డు సచివాలయాలను కలెక్టర్‌, ట్రైనీ ఐపీఎస్‌ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు పట్టిక తనిఖీ చేసి ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? లేదా? అని అధికారులను ఆరా తీశారు.


ఇప్పటి వరకు ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించారు వంటి వాటిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌ నవశకంలో భాగంగా బియ్యం కార్డుల పంపిణీ ఎంతవరకు జరిగిందని, ఇంకా ఎంతమందికి అందించాల్సి ఉందని, ఈకేవైసీ వంటివి పూర్తయ్యాయా? వంటి వివరాలపై ఆరా తీశారు. కాపు నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, బియ్యం కార్డు, పేదలందరికీ ఇంటి పట్టాలు తదితర సంక్షేమ పథకాల అర్హుల జాబితాను పరిశీలించారు. 


వెల్దుర్తి: మండలంలోని మదారుపురం రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్‌ వీరపాండియన్‌ సోమవారం తనిఖీ చేశారు.  రైతులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు. అనంతరం సూదపల్లె గ్రామ జిల్లా పరిషత్‌ పాఠశాలను తనిఖీ చేసి 9,10వ తరగతుల విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-09-22T10:44:43+05:30 IST