Abn logo
Sep 26 2021 @ 00:33AM

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈ జయవంత్‌రావు చౌహాన్‌

ఎస్‌ఈ జయవంత్‌రావు చౌహాన్‌

దస్తూరాబాద్‌, సెప్టెంబరు 25 : విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జయవంత్‌రావు చౌహాన్‌ అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో శనివారం దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, కడెం, పెంబి, మామడ మండలాల విద్యుత్‌ ఏఈ, సబ్‌ ఇంజనీర్‌లతో ఏర్పాటు చేసిన ఈఆర్‌వో కోఆర్డినేషన్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఈలతో ఆయన మాట్లాడుతూ... వినయోగ దారులకు మెరుగైన సేవలు అందించాలని, అక్రమ కరెంట్‌ వాడకాన్ని అరి కట్టాలని, విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసు కోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా తగుజాగ్రత్తలు తీసు కోవాలని సూచనలు ఇచ్చారు. వినియోగదారుల నుండి కరెంట్‌ బిల్లులను 100 శాతం సేకరించాలని కోరారు. ఇందులో డీఈ మధుసూదన్‌, ఏడీఈ ఇదన్న, ఏఏవో సురేష్‌, ఐదుమండలాల ఏఈలు శ్రీనివాస్‌, సుమన్‌ కుమార్‌, సాయి కిరణ్‌, లచ్చన్న, తిరుపతి, జేఏవో పాషా, సబ్‌ ఇంజనీర్లు నాగరాజు, వెంకటేష్‌, విద్యుత్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.