ఆర్థిక సాయం అందించరూ!

ABN , First Publish Date - 2020-06-01T10:44:36+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కర్రపని వారి కి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గోపాలకృష్ణ కర్రపనివారల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తాడుతూరి అచ్యుతరావు, ఆర్‌.యల్లేశ్‌ కోరారు

ఆర్థిక సాయం అందించరూ!

బొబ్బిలి, మే 31:  లాక్‌డౌన్‌ కారణంగా  ఉపాధి కోల్పోయిన  కర్రపని వారి కి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గోపాలకృష్ణ కర్రపనివారల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తాడుతూరి అచ్యుతరావు, ఆర్‌.యల్లేశ్‌ కోరారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ 2008లో తామంతా  లేబర్‌ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నామన్నారు. ఇంకా అనేకమంది వృత్తిలో కొనసాగుతూ ఎటువంటి సహకారం పొందడం లేదన్నారు. తెలుపు రేషన్‌కార్డు కలిగి ఉండి కార్మికులుగా పనిచేస్తున్న వారందరి నీ వలంటీర్ల ద్వారా సర్వే చేయించి ఆర్థిక సాయం చేయాలని  వారు కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.హరి, ఎ.సూరిబాబు, పి.సత్య నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:44:36+05:30 IST