నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2022-08-04T06:10:56+05:30 IST

జిల్లాలోని మహాతా ్మజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల, వసతి గృహాల విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని వెనుకబడిన తరగతుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లి, జైనథ్‌లలోని రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల,వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రంలో

నాణ్యమైన భోజనం అందించాలి
వసతిగృహంలో మెనూ రికార్డులను పరిశీలిస్తున్న జాయింట్‌ డైరెక్టర్‌

వెనుకబడిన తరగతుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 3: జిల్లాలోని మహాతా ్మజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల, వసతి గృహాల విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని వెనుకబడిన తరగతుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లి, జైనథ్‌లలోని రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల,వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రంలో నడుపబడుతు న్న రెసిడెన్షియల్‌ పాఠశల, కళాశాల, వసతి నిర్వహణపై పత్రికలలో వస్తున్న వ్యతిరేక వార్తలపై ప్రభుత్వం స్పందించి నిర్వహణ తీరును, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర  నివేదికను స మర్పించేంందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు అధికారుల బృందాలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని వెనుకబడి న తరగతుల సంక్షేమ శాఖ ద్వారా నడుప బడుతున్న ఇదుల్లా సావర్‌గాం, జైనథ్‌, ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లిలోని వసతి గృహాలను తనిఖీ చేసి ఆహార దినుసులు, కూరగాయల సరఫరా, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం, నిర్వహణ, రికార్డులను పరిశీలించి పలు ఆదేశాలు, సూచనలను చేయడం జరి గిందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మెడికల్‌ చెకప్‌లను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.రాజలింగు, ఆర్‌సీవో కె.గోపిచంద్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-04T06:10:56+05:30 IST