ఎన్నికలకు ముందే ఉచిత టీకాలు వేయండి: మోదీని కోరిన దీదీ

ABN , First Publish Date - 2021-02-25T00:06:42+05:30 IST

వేయాలని ప్రధానమంత్రి మోదీకి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా తమకు అవసరమైనన్ని కోవిడ్ వ్యాక్సీన్‌లను అందించాలని మమతా పేర్కొన్నారు

ఎన్నికలకు ముందే ఉచిత టీకాలు వేయండి: మోదీని కోరిన దీదీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎన్నికలు ముందే ఉచితంగా కోవిడ్ టీకాలు వేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రానున్న ఎన్నికల నేపధ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని అధిగమించాలంటే ఎన్నికలకు ముందే ఉచిత టీకాలు వేయాలని ప్రధానమంత్రి మోదీకి బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా తమకు అవసరమైనన్ని కోవిడ్ వ్యాక్సీన్‌లను అందించాలని మమతా పేర్కొన్నారు.


‘‘మరికొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు నిలబడబోతోంది. ప్రజలు, ఎన్నికల సిబ్బందికి కోవిడ్ నుంచి రక్షణ కల్పించాలి. ఈ విషయమై మేము చాలా ఆందోళనతో ఉన్నాం. ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు వేయాలని నిర్ణయించాం. తక్షణ ఆరోగ్య చర్యల కింద రాష్ట్రానికి అవసరమైన టీకాలను ఉచితంగా పంపించండి’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Updated Date - 2021-02-25T00:06:42+05:30 IST