వర్ధమాన దేశాలకు ఊతమివ్వాలి: మోదీ

ABN , First Publish Date - 2020-11-23T07:23:39+05:30 IST

వర్ధమాన దేశాలకు మరింత ఊతంగా సాంకేతి క, ఆర్థిక సాయం చేస్తే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. జీ-20 అనుబంధ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...

వర్ధమాన దేశాలకు ఊతమివ్వాలి: మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 22: వర్ధమాన దేశాలకు మరింత ఊతంగా సాంకేతి క, ఆర్థిక సాయం చేస్తే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. జీ-20 అనుబంధ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై పోరాటం సమగ్రంగా, విస్తృతంగా ఉండాలన్నారు. పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను మించి భారత్‌ ముందుకు వెళ్తోందని చెప్పారు. కార్మికుల శ్రమశక్తికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రధాని అన్నారు.


యూపీలో తాగు నీటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. రూ.5,555.8 కోట్ల విలువైన ఈ పథకం ద్వారా 2024 నాటికి 2,995 గ్రామాల్లోని ఇళ్లకు నల్లా నీటిని అందిస్తారు.

Updated Date - 2020-11-23T07:23:39+05:30 IST