విపత్తులోనూ పౌష్టికాహారం అందజేత

ABN , First Publish Date - 2021-06-24T04:55:25+05:30 IST

కరోనా వి పత్తులోనూ సంక్షేమ పథకాలు అమలు, విద్యార్థులకందాల్సిన పౌష్టికాహారం అందజేసిన ఘనత ము ఖ్యమంత్రి జగనకు దక్కుతోందని అనుడా ఛైర్మన శింగసాని గురుమోహన, రాష్ట్ర సగర కార్పొరేషన ఛైర్‌పర్సన గానుగపెంట రమణమ్మ పేర్కొన్నారు.

విపత్తులోనూ పౌష్టికాహారం అందజేత
కందిబేడలు పంపిణీ చేస్తున్న దృశ్యం

బద్వేలు రూరల్‌, జూన 23: కరోనా వి పత్తులోనూ సంక్షేమ పథకాలు అమలు, విద్యార్థులకందాల్సిన పౌష్టికాహారం అందజేసిన ఘనత ము ఖ్యమంత్రి జగనకు దక్కుతోందని అనుడా ఛైర్మన శింగసాని గురుమోహన, రాష్ట్ర సగర కార్పొరేషన ఛైర్‌పర్సన గానుగపెంట రమణమ్మ పేర్కొన్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా జిల్లా పరిషత పాఠశాల విద్యార్థులకు ప్రధానో పాధ్యాయుడు గాజులపల్లె వెంకటసుబ్బారెడ్డి కందిబేడలను అందించా రు. విద్యాకమిటీ ఛైర్మన రవిచంద్రారెడ్డి, వైసీపీ నేతలు సుందరరామిరెడ్డి, బంగారు శీనయ్య,  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కలసపాడు, జూన 23: స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పా ఠశాలలో విద్యార్థులకు కందిబేడలను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు కవిత మాట్లాడారు. సర్పంచ శివలీల, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ నవీనకుమార్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

కాశినాయన జూన 23: ప్రభుత్వ పాఠ శాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మిద్దెల సర్పంచ వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వపాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్న క్రిష్ణయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు కంది పప్పు ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

పోరుమామిళ్ల, జూన 23: స్థానిక ఓఎల్‌ఎఫ్‌ ఉన్నత బాలికల పాఠశాలలో 221 మంది విద్యార్థినులకు ఒక్కో విద్యార్ధికి 6.5 కిలోల కందిపప్పు ప్యాకెట్లను పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్‌ అందించారు.

ఓఎల్‌ఎఫ్‌ బాలికల ఉన్నతపాఠశాలలో ప్రధానోపాధ్యాయురా లు చిత్తా ఆరోగ్యరాణి, విద్యాకమిటీ ఛైర్మన సుప్రియ, పాఠశాల ఉపాధ్యాయినులు జానీ, సరళ, మేరీ, అనిత తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:55:25+05:30 IST