ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల అందజేత

ABN , First Publish Date - 2021-06-24T04:58:45+05:30 IST

పలు ప్రైవేటు కంపెనీలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ వీర పాండియన్‌కు అందజేశాయి.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల అందజేత
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేస్తున్న దృశ్యం

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 23:  పలు ప్రైవేటు కంపెనీలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ వీర పాండియన్‌కు అందజేశాయి. ఏక్షన్‌ ఎయిడ్‌ మరియు గివ్‌ ఇండియా వారు రూ.22 లక్షలు విలువ చేసే 40 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఏక్షన్‌ ఎయిడ్‌ ప్రతినిధి వరప్రసాద్‌, గివ్‌ ఇండియా ప్రతినిధి విజయరాజులు కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సదాశివరెడ్డి పాల్గొన్నారు. అలాగే అల్ర్టాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ వారు రూ.5 లక్షలు విలువ చేసే 10 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందజేశారు. ఎంఎస్‌ఆర్‌కేహెచ్‌ఆర్‌ హెడ్‌ ప్రసాద్‌, అడ్మిన్‌ సీహెచ్‌ అంజనా ప్రకాష్‌, సీఎస్‌ఆర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:58:45+05:30 IST