సంపద సృష్టికర్త చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-28T05:05:02+05:30 IST

రాష్ట్రం విడిపోయినప్పుడు 16వేల కోట్ల లోటుబడ్జెట్‌ ఉన్నా తనకున్న అపార అనుభవంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో సంపద సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నారని టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అన్నారు.

సంపద సృష్టికర్త చంద్రబాబు
టీడీపీ ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు ్యకర్తలు

సూళ్లూరుపేటలో పసుపు జెండా ఎగరేయాలి

 టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు 

నాయుడుపేట టౌన్‌, జనవరి 27 : రాష్ట్రం విడిపోయినప్పుడు 16వేల కోట్ల లోటుబడ్జెట్‌ ఉన్నా తనకున్న అపార అనుభవంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో సంపద సృష్టికర్తగా పేరు తెచ్చుకున్నారని టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అన్నారు. నాయుడుపేట కె.కె. కల్యాణ సదన్‌లో గురువారం సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో  నియోజకవర్గం టీడీపీ ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ ఏపార్టీలో లేని విధంగా టీడీపీలో ఉన్నత స్థానాల్లో దళితులను నియమించారన్నారు. పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.  ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ మాస్క్‌లు,  కొవిడ్‌ కిట్‌లను కావాలని కోరితే వైసీపీ ప్రభుత్వం ఆయనమీద కక్ష కట్టి మానసికంగా హింసకు గురిచేసి పిచ్చివాడిగా ముద్రవేసి ఆయన మరణానికి కారణమైందన్నారు. దళితుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనీ, దళితు లందరూ ఏకతాటిపైకొచ్చి సూళ్లూరుపేట నియోజకవర్గంలో పసుపు జెండాను ఎగురవేసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు.

దళితులు అభివృద్ధి కావాలంటే... చంద్రబాబు రావాలి

 టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం

నాయుడుపేట : ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి కావాలంటే దళితులందరూ కలసికట్టుగా కృషిచేసి  మళ్లీ చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా తీసుకురావాలని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.   నియోజకవర్గం టీడీపీ ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరగడంతోపాటు వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులపాలు గురిచేస్తున్నారన్నారు.  మాజీమంత్రి డాక్టర్‌ పరసారత్నం మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో   టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం టీడీపీ ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలసి కట్టుగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో  టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు నరసిం హయాదవ్‌, సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, నాయకులు బొమ్మన శ్రీధర్‌, విజేత, పనబాక భూలక్ష్మి, సుధాకర్‌రెడ్డి   , టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందలకృష్ణారెడ్డి,  మాజీ ఎంపీపీ కన్నెమ్మ, నాయకులు దార్ల రాజేంద్ర, విజయకుమార్‌నాయుడు, శ్రీనివాసులునాయుడు, కృష్ణయ్య, అవధానం సుధీర్‌, జక్కరయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:05:02+05:30 IST