ఇక పీఎస్‌బీల ప్రైవేటీకరణ !

ABN , First Publish Date - 2021-11-25T08:57:27+05:30 IST

బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని భారీ సంస్కరణలకు సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రస్తు తం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులనూ...

ఇక పీఎస్‌బీల ప్రైవేటీకరణ !

త్వరలో పార్లమెంట్‌లో బిల్లు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని భారీ సంస్కరణలకు సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రస్తు తం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులనూ (పీ ఎ్‌సబీ) ప్రైవేటీకరించేందుకు సిద్ధం అవుతోంది.   ఇందుకోసం పీఎ్‌సబీల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి కుదించబోతోంది. ఇందుకు వీలు కల్పించే  బ్యాకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు-2021ని ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే  ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ఇప్పటి వరకు ఏదైనా సంస్థ ఈక్విటీలో 51 శాతానికి తగ్గకుండా ఉంటే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా పరిగణిస్తున్నారు. పీఎస్‌బీలదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్ని పీఎ్‌సబీల్లో ప్రభుత్వానికి 51 శాతానికిపైగానే వాటా ఉంది. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణ కోసం ఈ బిల్లు తెస్తున్నట్టు చెబుతున్నారు. 

మాకేమీ తెలియదు : ఈ వార్తలతో ఐఓబీ, సీబీఐ షేర్లు లాభాల బాట పట్టాయి. ఈ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ కోసమే ప్రభుత్వం ఈ సవరణ బిల్లు తెస్తోందని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అయితే ఈ రెండు బ్యాంకులు మాత్రం, అసలు దీని గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపాయి. 

Updated Date - 2021-11-25T08:57:27+05:30 IST