మానసిక ఆస్పత్రి జలమయం

ABN , First Publish Date - 2021-06-24T05:54:43+05:30 IST

భారీ వర్షానికి బుధవారం చినవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి జలమయమవ్వడంతో వైద్యులు, రోగులు, వారి బంధువులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మానసిక ఆస్పత్రి జలమయం
బాత్‌రూమ్‌లోనుంచి బయటకు వస్తున్న నీరు

భారీ వర్షానికి  బాత్‌రూమ్‌లోనుంచి బయటకు వచ్చిన నీరు  

దుర్వాసనతో ఇబ్బందులకు గురైన రోగులు, వారి బంధువులు   

పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులు

పెదవాల్తేరు, జూన్‌ 23: భారీ వర్షానికి బుధవారం చినవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి జలమయమవ్వడంతో వైద్యులు, రోగులు, వారి బంధువులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రి ఆవరణలో మోకాల్లోతు వరకు నీరు నిలిచిపోయింది. అలాగే ఓపీ వద్దకు వర్షపు నీరు చేరడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. భారీ వర్షం మూలంగా బాత్‌రూమ్‌ లోనుంచి నీరు బయటకు రావడంతో దుర్వాసన వస్తోందని రోగులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఓపీలోకి పెద్దఎత్తున వర్షపు నీరొచ్చి రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నా  ఆస్పత్రి బాధ్యులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించారు.  మానసిక ఆస్పత్రికి పూర్తిస్థాయి అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు.



Updated Date - 2021-06-24T05:54:43+05:30 IST