Abn logo
Aug 14 2020 @ 14:12PM

సమాజానికి కొత్త మెసేజ్ ఇచ్చే 'సైకో'

శ్రీమతి లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బానర్‌పై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సైకో'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ సాయి హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ మిస్ కాకుండా రిచ్‌గా సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే ఓ కొత్త పాయింట్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుందని, ఈ చిత్రం సమాజానికి ఓ కొత్త మెసేజ్ ఇస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలమని చిత్ర దర్శకుడు కార్తీక్ సాయి అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement