వాళ్లిద్దరి శవాలను మేం తీసుకోం.. అంత్యక్రియలు కూడా చేయం.. తేల్చిచెబుతున్న బంధువులు.. వాళ్ల నిర్ణయం వెనుక అసలు కథ ఇదీ..!

ABN , First Publish Date - 2021-10-12T11:46:42+05:30 IST

హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ఒక సైకో వ్యక్తి తన కారును ఎక్కించాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మిగతా నలుగురి గాయాలయ్యాయి...

వాళ్లిద్దరి శవాలను మేం తీసుకోం.. అంత్యక్రియలు కూడా చేయం.. తేల్చిచెబుతున్న బంధువులు.. వాళ్ల నిర్ణయం వెనుక అసలు కథ ఇదీ..!

హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ఒక సైకో వ్యక్తి తన కారును ఎక్కించాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మిగతా నలుగురి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చనిపోయిన వారి శవాలను పోస్టుమార్టం చేశాక.. తిరిగి వారి బంధువులను అప్పగించారు. కానీ మృతుల బంధువులు ఆ రెండు శవాలను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. నిందితుడిని అరెస్టు చేసేంత వరకూ ఆ శవాలను ఎక్కడికీ కదలనివ్వమని ఆస్పత్రిలోనే నిరసనకు కూర్చున్నారు. అసలేం జరిగిదంటే..


మహీంద్ర అనే వ్యక్తి తన సోదరుడి కుటుంబంతో సహా కర్నాల్ జిల్లాలోని నీలోఖేడీ ప్రాంతంలో నివసించేవాడు. మహీంద్ర కుటుంబం నివసించే వీధిలోని బల్వీందర్ కుబుంబం కూడా నివసిస్తోంది. బల్వీందర్ కుమారుడు అమన్ ఒక కొత్త కారు కొన్నాడు. ఆ కారుని వీధిలో చాలా వేగంగా నడిపేవాడు. వీధిలో పిల్లలు ఆడుకుంటుంటారని.. అంత వేగంగా కారు నడపవద్దని మహీంద్ర కుటుంబం ఎంత చెప్పినప్పటికీ అమన్, బల్వీందర్ కుటుంబం పట్టించుకోలేదు.


మహీంద్ర ఇంట్లో అతని కూతురు కీర్తి పెళ్లి మరి రెండు రోజుల్లో ఉండగా అతని సమీప బంధువులందరూ వచ్చారు. రోజూలాగే పిల్లలు ఆడుకుంటుండగా అమన్ వేగంగా కారు నడుపుకొని వచ్చాడు. ఎలాగో పిల్లలకు ప్రమాదం తప్పింది. దీంతో మహీంద్ర, అతని కుటుంబమంతా కలిసి.. బల్వీందర్ ఇంటికి ఆగ్రహంగా వెళ్లింది. వారంతా బల్వీందర్‌తో గొడవ పడ్డారు. వెంటనే అమన్‌ను శిక్షించాలని అన్నారు. కానీ బల్వీందర్ వారికి ఎదురు తిరిగాడు. తన కుమారుడు అమన్ ఇలాగే కారు నడుపుతాడని వాదించాడు.


వారంతా అక్కడ గొడవపడుతూ ఉండగా.. అమన్ ఒక్కసారిగా తన కారుతో రివర్స్‌లో వచ్చి అందరిపై ఎక్కించేశాడు. ఆ ఘటనలో మహీంద్ర భార్య, అతని సోదరుడు అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ కాలు విరిగిపోయింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అమన్, అతని తండ్రి బల్వీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


ఈ ఘటనపై మహీంద్ర కుటుంబం, ఆ వీధి వారు అమన్‌ను వెంటనే అరెస్టె చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనగా నగరంలోని అంబేడ్కర్ చౌరస్తాను బ్లాక్ చేసి ట్రాఫిక్ జామ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు వారితో మాట్లాడి నిందితులను వదలబోమని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-12T11:46:42+05:30 IST