Advertisement
Advertisement
Abn logo
Advertisement

సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ క్రీడా పోటీల్లో పీయూ పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు విజయం

పాలమూరు యూనివర్సిటీ, డిసెంబరు 6 : గుంటూరులోని కేఎల్‌ఈఎఫ్‌ యూనివర్సిటీలో ఈనెల 6 నుంచి 10వరకు జరుగుతున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ క్రీడా పోటీల్లో మ హబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పీయూ పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు విజయం సాధిం చిం ది. మొదటిరోజు సోమవారం తమిళనాడు అమ్రిత యూనివర్సిటీపై పీయూ పురుషుల బ్యా డ్మింటన్‌ జట్టు పోటీలో తలపడింది. పీయూ, అమ్రిత యూనివర్సిటీల టీమ్స్‌ ఐదు మ్యా చ్‌ లు ఆడగా, అందులో పీయూ 3-2 తేడాతో విజయం సాధించిందని పీయూ పీడీ డాక్టర్‌ కె.బాల్‌రాజ్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం రెండో మ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీతో తలపడుతుందని అన్నారు. మొదటి మ్యాచ్‌ విజయం సాధించిన పీయూ పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు క్రీడాకారులను పీయూ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌బీ.లక్ష్మీకాంత్‌ రా థో డ్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పిండి పవన్‌కుమార్‌, పీయూ పీడీ డాక్టర్‌ కె.బాల్‌రాజ్‌గౌడ్‌లు అభినందించారు. 

Advertisement
Advertisement