Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : పబ్జీ ద్వారా పరిచయం.. ప్రేమ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

  • యువతి వద్ద రూ. 2.5 లక్షలు తీసుకొని పరారీ 


హైదరాబాద్ సిటీ/బేగంపేట : పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయం అయ్యాడు.. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి  యువతి వద్ద లక్షల రూపాయలు తీసుకొని పారిపోయాడు ఓ వ్యక్తి. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా, ఖానాపూర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్లా ఫైజల్‌ 2019లో సెల్‌ఫోన్‌లో పబ్జీగేమ్స్‌ ఆడుతుండేవాడు. ఈ గేమ్‌లో బోరబండకు చెందిన ఓ యువతికి పరిచయం అయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకున్న అతడు తరచూ కలవడంతోపాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అవసరం ఉందని ఆమె వద్ద రూ. 2.5 లక్షలు తీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమని యువతి అడగగా తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

TAGS: pubg LOVE
Advertisement
Advertisement