ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య

ABN , First Publish Date - 2022-06-17T05:28:51+05:30 IST

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు చేపడుతున్నట్లు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎం అనిల్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య
మాగనూరులో డ్రాప్‌ అవుట్‌ విద్యార్థులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు

మక్తల్‌, జూన్‌ 16 : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు చేపడుతున్నట్లు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల జీహెచ్‌ఎం అనిల్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం బడిబాట కార్యక్ర మంలో భాగంగా మండలంలోని ఉప్పర్‌పల్లి, దాసర్‌దొడ్డి, రుద్రసముద్రం గ్రామానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు అడ్మీషన్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్‌గౌడ్‌ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లబోధనలు ప్రారంభించిందన్నారు. విద్యార్థు లకు పౌష్టికాహారం, ఏకరూప దుస్తులు, నిపుణులైన అధ్యాపకులచే విద్యను అందిస్తామన్నారు. మండ లంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు అ రుణ, నాగార్జున, ప్రహ్లాద్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.  

మాగనూరు : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని మా గనూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సిములు పేర్కొన్నారు. గురువారం మండల కేం ద్రంలో ఇంటింటికీ తిరిగి డ్రాప్‌ ఆవుట్‌ అయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలిసి పాఠశాల లకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మన ఊరు - మన బడి కా ర్యక్రమం ఏర్పాటు చేసి పాఠశాలలకు మౌలిక వస తులు ఏర్పాటు చేస్తోందన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయడం జరుగుతుందన్నారు. రామకృష్ణాచారి, గోపాల్‌ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

నారాయణపేట రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేట గ్రౌండ్‌ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండలంలోని సింగారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు విద్యతో పాటు ఏకరూప దుస్తులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాదిలో పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడి యం ఉంటుందన్నారు. పిల్లలను కూలీ పనులకు పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలన్నారు.  ఉప సర్పంచ్‌ సిద్దప్ప, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఎంసీ వైస్‌ చైర్మెన్‌ భాగ్యమ్మ, సీఆర్పీ పవిత్ర, హెచ్‌ఎం జయప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-17T05:28:51+05:30 IST