ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-05-30T11:25:59+05:30 IST

ప్రజారోగ్యభద్రతే ప్రధా న ధ్యేయంగా పాలన సాగుతోందని పేదల పాలిటి పెన్నిధిగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రశంసలు

ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

మెడికల్‌ హబ్‌గా జిల్లా : ఉప ముఖ్యమంత్రి అంజాద్‌, ఇన్‌చార్జి మంత్రి సురేష్‌


కడప(కలెక్టరేట్‌)మే29: ప్రజారోగ్యభద్రతే ప్రధా న ధ్యేయంగా పాలన  సాగుతోందని పేదల పాలిటి పెన్నిధిగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రశంసలు అందుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఇన్‌ఛార్జి మంత్రి ఆది మూల పు సురేష్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ స్పందన హాలులో ‘ప్రజారోగ్యం- సంస్కరణలు, వైద్యవిద్య అభివృద్ధి’పై కలెక్టర్‌ హరికిరణ్‌ అధ్యక్షతన మేధో మథన సదస్సు జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో వైద్య రంగంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యాచరణపై సాగిన చర్చలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్యం మరింత పటిష్టం చేసే  దిశగా విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. 1.42 కోట్ల మంది ప్రజలను వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీపరిధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నా రు. రాష్ట్రంలో కొత్తగా మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు, ఏజెన్సీ ప్రాంతాలైన ఐటీడీఏ పరిధిలో ఏడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనుందన్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన మెబైల్‌ వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి 1060 కొత్త 108,104 వాహనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య, విద్య రంగాలు రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు తెర తీశారన్నారు. రాయల సీమ జిల్లాలకు తల మానికంగా జిల్లాను మెడికల్‌ హబ్‌గా తీర్చి  దిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారన్నారు. రిమ్స్‌ ప్రాంగణలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్‌ ఆస్పత్రి, మానసిక వైద్యశాల నిర్మాణానికి శిలా ఫలకం వేశారన్నారు పులివెందుల నియోజక వర్గంలోరూ. 347 కోట్లతో 65 ఎకరా ల్లో వందపడకల ఆస్పత్రి నిర్మాణానికి శంఖు స్థాపన చేశారన్నారు. ఎమ్మెల్యేలు రవీంద్రనాధ రెడ్డి, వెంకటసుబ్బయ్య, రఘురామిరెడ్డి, జాయిం ట్‌ కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌ వర్మ, శిక్షణా కలెక్టర్‌  వికా్‌స మర్మాట్‌, డీఆర్వో రఘునాధ్‌, సీపీఓ తిప్పేస్వామి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T11:25:59+05:30 IST