ప్రమాదంలో ప్రజారోగ్యం

ABN , First Publish Date - 2021-06-17T06:02:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

ప్రమాదంలో ప్రజారోగ్యం
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, జూన్‌ 16:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని టీడీపీ చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం చేపట్టిన ధర్నాలో ఆఆయన మాట్లాడుతూ, కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఏకైక మార్గమని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు ఫ్రంట్‌లైన్‌ వారియర్లకే పూర్తిగా వ్యాక్సిన్‌ అందకపోవడం విచారకరమని వాపోయారు. మొదటి డోసు వేసుకున్న చాలా మందికి రెండో డోసు వాక్సిన్‌ కూడా ఇవ్వలేదని, దీంతో లక్షలాది మంది నిరీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా విపత్తు కారణంగా కోటికిపైగా కుటుంబాల ఉపాధి దెబ్బతిందని, వారిని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, కోరుకొండ రవికుమార్‌, డొంకిన అప్పలనాయుడు, గొలగాని రాజారావు, ముచ్ఛకర్ల తాతయ్యలు, దొడ్డి కిషోర్‌, మరిసా సతీశ్‌, నైథాన నాని పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T06:02:36+05:30 IST