Abn logo
Sep 25 2021 @ 23:44PM

ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకోవాలి

పాలకొండలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు


భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలి 

 వివిధ సంఘాల నాయకుల పిలుపు

రాజాంరూరల్‌: ప్రభుత్వరంగ సంస్థల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రామ్మూర్తినాయుడు  పేర్కొ న్నారు. ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంబంధించిన గోడపత్రికను శనివా రం రాజాంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్రీనివాసరావు, రవి, శంకర్రావు, కనకరాజు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. ఫ జలుమూరు: వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ ను విజయవంతం చేయాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ యూనియన్‌, భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు ఎన్‌.నీలంరాజు, ఎస్‌.బాబూరావులు కోరారు. సుబ్రమణ్యపురం గ్రామంలో భారత్‌ బంద్‌ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కె.రమణ, పి.గోవిందరావు, సీహెచ్‌.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.ఫనరస న్నపేట: భారత బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘ జిల్లా సహా యక కార్యదర్శి కరగాన కొండయ్య ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. సురేష్‌బాబు, సంఘ నాయకులు పాల్గొన్నారు. ఫ పలాస: రైతు చట్టాల రద్దుకు సోమవారం నిర్వహించే భారత్‌ బంద్‌కు తాము మద్దతు ఇస్తున్నామని జీడి కార్మికసంఘ నాయకులు అంబటి కృష్ణమూర్తి, బొంపల్లి సింహాచలం, బొమ్మాళి తాత య్య ప్రకటించారు. ఈ మేరకు పలాసలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎన్‌.గణపతి, ఎం.రామారావు, వి.ముకుందరావు, ఎం.వినోద్‌, వి.కృష్ణ పాల్గొన్నారు. ఫ మందస:భారత్‌బంద్‌కు సహకరించాలని కార్మికసంఘ నాయకులు పిలుపునిచ్చారు. మందసలో  కరపత్రాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో కార్మిక నాయకులు మట్ట ఖగేశ్వరరావు, వీవీ రమణమూర్తి, ఆర్‌.దిలీప్‌కుమార్‌, మురళి పాల్గొన్నారు. ఫపాలకొండ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సోమవారం నిర్వహించే బంద్‌ విజయవంతం చేయాలని సీఐటీయూ  జిల్లా కార్యదర్శి దావాల రమణారావు కోరారు. శనివారం పాలకొండలో  కరపత్రాలు పంపిణీ చేశారు. అనంత రం ద్విచక్రవాహన ర్యాలీ చేశారు. నాయకులు బి.అమరవేణి, దూసి దుర్గారావు,  కాదరాము పాల్గొన్నారు. అలాగే భారత్‌బంద్‌కు అన్ని వర్గాలవారు సహకరించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఒక ప్రకటనలో కోరారు.