3 నుంచి ఎంటీఏఆర్‌ పబ్లిక్‌ ఇష్యూ

ABN , First Publish Date - 2021-02-26T09:53:02+05:30 IST

3 నుంచి ఎంటీఏఆర్‌ పబ్లిక్‌ ఇష్యూ

3 నుంచి ఎంటీఏఆర్‌ పబ్లిక్‌ ఇష్యూ

ధర శ్రేణి రూ.574-575


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణి ని రూ.574-575గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 21,48149 తాజా షేర్ల ను జారీ చేయడం ద్వారా రూ.124 కోట్లను కంపెనీ సమీకరించనుంది. తాజా షేర్లు కాకుండా కంపెనీ ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా 82.24 లక్షల షేర్లను విక్రయిస్తారు. వీటి మొత్తం విలువ రూ.473 కోట్లు. తాజా షేర్ల జారీ ద్వారా లభించిన నిధులను రుణాల చెల్లింపు, నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో భాగంగా 18,51,851 షేర్లను రూ.100 కోట్లకు యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌కు కేటాయిస్తారు. కాగా ఇష్యూ అనంతరం ప్రమోటర్ల వాటా 67 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. 

Updated Date - 2021-02-26T09:53:02+05:30 IST