సమన్వయంతో ప్రజాసమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-30T05:11:35+05:30 IST

సమన్వయంతో ప్రజాసమస్యలను పరిష్కరించాలి

సమన్వయంతో ప్రజాసమస్యలను పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మండల పరిషత్‌ అధ్యక్షురాలు ఎల్లుబాయి

శామీర్‌పేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ ఎల్లుబాయి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. శామీర్‌పేటలో రైతుబజార్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీపీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రవీందర్‌యాదవ్‌ను కోరారు. మజీద్‌పూర్‌లోని ప్రజయ్‌ హోమ్స్‌, బాలాజీ హోమ్స్‌లో మురుగు కాలువల సమస్యను పరిష్కరించాలని గ్రామ కార్యదర్శిని కోరినా సమస్య పరిష్కరించలేదని ఎంపీటీసీ అశోక్‌రెడ్డి అన్నారు. మజీద్‌పూర్‌ పాఠశాలలో గణితం, సైన్స్‌ టీచర్లు లేరని సర్పంచ్‌ మోహన్‌రెడ్డి ఎంఈవోకు తెలిపారు. పంచాయతీల ద్వారానే టీచర్లను నియమించుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఎంఈవో విరణ ఇచ్చారు. శామీర్‌పేట పాఠశాలలో పీఈటీ లేడని ఎంపీటీసీ సాయిబాబ ఎంఈవో సభదృష్టికి తెచ్చారు. గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే అధికారుతులు డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలియాబాద్‌ ఎంపీటీసీ అశోక్‌ తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ రవీనందర్‌, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్‌ఎంపీపీ సుజాత, ఎంపీడీవో వాణి, ఎంపీటీసీల అశోక్‌రెడ్డి, సర్పంచ్‌ సరసం మోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:11:35+05:30 IST