ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-08T04:43:55+05:30 IST

ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు.

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, డిసెంబరు 7: ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం లింగసముద్రంలోని తహసీల్దార్‌, ఎంపీ డీవో కార్యాలయల్లో ప్రజల నుంచి  అర్జీలు స్వీకరించా రు. ఈ సందర్బంగా మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయన్నా రు. ఈ సమస్యలను పరిష్కరించేలా అధికారులు పని చేయాలన్నారు. పెదపవని గ్రామంలో ఎస్సీలకు శ్మశానం లేక ఇబ్బం దులు పడుతున్నట్టు ఆ గ్రామ వైసీపీ నాయకులు మందా కొండయ్య, రామిశెట్టి మాలకొండయ్యలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అలాగే గ్రామంలో కొందరు అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారని వారు చెప్పారు. అధికారుల అనుమతి లేకుండా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ బ్రహ్మయ్యను ఎమ్మెల్యే ఆదేశించారు.

లింగసముద్రంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి గుడి వెనుక ఉన్న బీసీ కాలనీలో విద్యుత్‌ తీగలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కొత్త తీగలు ఏర్పాటు చేయాలని కొందరు కాలనీ వాసులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశా రు. తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఏఈ రాఘవేంద్రను ఎమ్మె ల్యే ఆదేశించారు. ముత్యాలపాడు గ్రామంలో విద్యు త్‌ బకాయిలు చెల్లించక పోవ డంతో ఏడాది నుంచి ఆర్వో ప్లాంటు మూసి వేశారు. దీంతో గ్రామస్థులు మం చినీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వైసీపీ నాయకుడు రాజారావు మరికొందరు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. 

ఆర్వో ప్లాంటు మూసివేయడంపై ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డిపై ఎ మ్మెల్యే మహీధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంటు విద్యుత్‌ బకాయిలు రూ.80 వేలు పంచాయతీ నిధుల్లో చెల్లించి, ఆర్వో ప్లాంటును పంచా యతీకి అనుసంధానం చేసి మంచినీటిని అందిస్తామని ఎంపీడీవో చెప్పారు. 

కార్యక్రమంలో ఏవో జి.మధు, వైసీపీ మండల కన్వీనర్‌ పి.తిరుప తిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ షఫి, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ వంటేల శ్రీనివాసులు,  వి.కృష్ణారెడ్డి, బి.మధు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:43:55+05:30 IST