ప్రజా, కార్మిక సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-08-10T11:11:57+05:30 IST

ప్రజలు, కార్మికుల సమస్యలను పరి ష్కరించాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం లో

ప్రజా, కార్మిక సమస్యలను పరిష్కరించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం


ములుగు కలెక్టరేట్‌, ఆగస్టు 9: ప్రజలు, కార్మికుల సమస్యలను పరి ష్కరించాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం లో సేవ్‌ ఇండియా జైల్‌భరో కార్యక్రమం పేరుతో నాయకులు ఆదివారం ములుగులోని జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు.


ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకుడు తుమ్మల వెంకటరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, వ్యవసాయ కమిటీ జిల్లా కార్యదర్శి పొదిళ్ల చిట్టిబాబులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జూలై 17 నుంచి ఆగస్టు 9 వరకు ప్రజా సంఘాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదన్నారు. అందుకే క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న సేవ్‌ ఇండియా పేరుతో జైల్‌భ రో నిర్వహించడం జరిగిందన్నారు.


కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పేద కుటుంబాలకు ఆరు నెల ల పాటు రూ.7,500 అందించి రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి 10కిలోల బియ్యం ఇవ్వాలన్నారు. స్కీం వర్కర్లకు కనీస వేత నం రూ.21వేలు అందించి, ప్రభుత్వ సంస్థలను ప్రవేటీకరణ చేయకుం డా ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.


రైతులకు గిట్టు బాటు ధర కల్పించి ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నారు. కార్యక్రమం లో వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పులుగుజ్జు వెంకన్న, అవాజ్‌ జిల్లా కార్యదర్శి, ఎమ్డీ.అమ్జద్‌పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎమ్డీ. గపూర్‌పాషా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్‌, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి, నాయకులు రామస్వామి, కొర్ర రాజు, రవీందర్‌, రవిగౌడ్‌, రమేష్‌, కోటయ్య, రమ, శిరీష, కవిత, పూల, రజిత పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T11:11:57+05:30 IST