ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-12T06:47:06+05:30 IST

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌లు అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
దరఖాస్తులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్లు

సుభాష్‌నగర్‌, జూలై 11: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌లు అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మానికి జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందిన 97 మంది నుంచి వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన దరఖాస్తులలో ఎస్సీ కార్పొరేషన్‌-40 రెవెన్యూశాఖ-25, పంచాయతీరాజ్‌ శాఖ-6, మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవి 26 ఉన్నాయని వారు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు  సంబం ధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ ఆనంద్‌కుమార్‌, జిల్లా వ్యవ సాయ అధికారి శ్రీధర్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజమనో హర్‌రావు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి నతానియేలు, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, జిల్లా అగ్నిమాపక అధికారి పద్మావతి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీ అశోక్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువైరియా, మెప్మా పీడీ రవిందర్‌, స్పోర్ట్స్‌ అధికారి రాజవీరు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సి పల్‌ కమిషనర్లు, కలెక్టరేట్‌ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-12T06:47:06+05:30 IST