ప్రజాసేవ అభినందనీయం

ABN , First Publish Date - 2021-06-24T06:46:32+05:30 IST

కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడడంతోపాటు ప్రజాసేవలో నూ ముందుండటం అభినందనీయమని ఎస్పీ రంగనాథ్‌ అన్నారు.

ప్రజాసేవ అభినందనీయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఏవీ రంగనాథ్‌

 ఎస్పీ రంగనాథ్‌

నల్లగొండరూరల్‌, జూన్‌ 23: కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడడంతోపాటు ప్రజాసేవలో నూ ముందుండటం అభినందనీయమని ఎస్పీ రంగనాథ్‌ అన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఫౌండేషన్‌ స హకారంతో జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్రంలో మాలి పురుషోత్తంరెడ్డి ఐసోలేషన్‌ కేంద్రంలో బుధవారం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కుల ను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కరోనా వ్యాధితో బాధపడుతున్న సామాన్య ప్రజలకు సీపీఎం ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేవులపల్లి రెడ్డీస్‌ లాబ్‌ ప్లాంట్‌ ఇన్‌చార్జి కృష్ణారావు మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం చేస్తున్న సేవలను కొనియాడారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో వైద్య వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సీపీఎం పోరాటాలే కాకుండా సేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై అధికారుల మీద ఒత్తిడి పెంచి వైద్య పరంగా సామాన్య ప్రజలను ఆదుకుంటామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటికే మహిళలకు కుట్టు శిక్షణ, విద్యార్థులకు కరాటే, కంప్యూటర్‌లో శిక్షణ ఉచితంగా అందించామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, అక్కినపల్లి మీనయ్య, సయ్యద్‌ హషం,  ఎండీ సలీమ్‌, పుచ్చకాయల నర్సిరెడ్డి, పాలడుగు ప్రభావతి, గంజి మురళీధర్‌, దండెంపల్లి సత్తయ్య, వెంకటేశం, అరుణ, సైదులు, వెంకన్న పాల్గొన్నారు.   

Updated Date - 2021-06-24T06:46:32+05:30 IST