ప్రజా సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-04-22T05:10:19+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం
రైతు వేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

- మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి  

- రైతు వేదిక ప్రారంభం

మాగనూరు, ఏప్రిల్‌ 21 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని నేరేడుగం గ్రామంలో  రైతు వేదిక, మిషన్‌భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంకు, మన ఊరు - మన బడి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రాథమికోన్న త పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోందన్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్క రించేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా గ్రా మాల్లో ప్రతీ ఇంటికి నీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులు వ్యవసాయంలో తీసుకోవల్సిన మెలుకువలు, జాగ్రత్తల, సస్యరక్షణ చర్యలపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందన్నారు. కార్యక్రమంలో నారాయణపేట జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, మక్తల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేస్‌గౌడ్‌, ఎంపీపీ శ్యామలమ్మ, సింగిల్‌సిండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నేరేడుగం పీఠాధిపతి పంచమ సిద్దలింగ మహాస్వామి, జడ్పీ టీసీ సభ్యుడు వెంకటయ్య, వైస్‌ ఎంపీపీ తిప్పయ్య, ఏవో హరిత, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి, సర్పంచు అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.

లయన్స్‌ క్లబ్‌ సేవలు భేష్‌

మక్తల్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీమా ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు భేష్‌ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పేర్కొన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కోసం దాత లయన్‌ వెంకట్‌రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకు, కుళాయిలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే లయన్‌ సభ్యులు బి.కొండయ్య, అశోక్‌, శంకర్‌, వదిరాజ్‌లు విద్యార్థుల కు అవసరమై బేంచీలను ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌కు అందించారు. మార్కెట్‌ చైర్మన్‌ రాజేష్‌ గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ సత్యనారాయణ,  లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రమేష్‌రావు, సభ్యులు డాక్టర్‌ శ్రీరామ్‌, అంబదాస్‌రావు, శ్రీనివాస్‌, చంద్రకాంత్‌గౌడ్‌, నరేందర్‌, కర్నిస్వామి, సత్య అంజనేయులు, రాంచంద్రప్ప, పృథ్విరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-22T05:10:19+05:30 IST