ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-06-12T05:39:51+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బావుసాయిపేటలో శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌

- జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎమ్మెల్యే రమేష్‌బాబు

కోనరావుపేట, జూన్‌ 11 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే  ధ్యేయంగా పని చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో రూ.70 లక్షలతో చేపట్టిన పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని కులాలకు తెలంగాణ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గాంధీజీ కలలుగన్న పల్లెలు ఇప్పుడు తయారవుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రగతి సాధిస్తున్నాయన్నారు.  పంచాయతీలకు ప్రతీ నెల రూ. 256.66 కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.   కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇవ్వడం లేదన్నారు.   కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, టీఆర్‌ఎస్‌ నేత రాఘవరెడ్డి, నాయకులు మంతెన సంతోష్‌, సర్పంచ్‌ కెంద గంగాధర్‌, అబ్బసాని శంకర్‌గౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T05:39:51+05:30 IST